రేపల్లియ యద ఝల్లున

1 05 2008

ఆబాలగోపాలం(పిల్లలు,పెద్దలు అందరూ)మా బాలగోపాలుని,అచ్చెరువున(ఆశ్చర్యముతో)..అచ్చెరువున(ఆ చెరువు దగ్గర) విచ్చిన కన్నుల చూడ…తాండవమాడిన సరళి,గుండెల మ్రోగిన మురళి…ఇదేనా…

జీవన రాగమై బృందావన గీతమై …కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి  ఇదేనా….
మధురా నగరిలో యమునా లహరిలో …ఆ రాధ ఆరాధనా గీతి పలికించి …

సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి

వేణు గానాన్ని ఇంతకంటే అందంగా వర్ణించిన పాట ఇంకోటి లేదేమో తెలుగులో … హ్యాట్సాఫ్ టు వేటూరి

చిత్రం:సప్తపది (1981)
రచన:వేటూరి
సంగీతం:కె.వి.మహదేవన్
దర్శకత్వం:కె.విశ్వనాథ్

ఇక్కడ వినండి

రేపల్లియ యద ఝల్లున
పొంగిన రవళి
నవరస మురళీ
అ నందన మురళీ
ఇదేనా ఆ మురళీ
మోహన మురళీ |రేపల్లియ యద ఝల్లున|

కాళింది మడుగున
కాళీయుని పడగనా
ఆబాలగోపాల
మా బాలగోపాలుని |కాళింది మడుగున|
అచ్చెరువున అచ్చెరువున
విచ్చిన కన్నుల చూడ |అచ్చెరువున|

తాండవమాడిన సరళి
గుండెల మ్రోగిన మురళి
ఇదేనా…ఇదేనా
ఆ మురళీ

అనగల రాగమై
తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించి
మరులే కురిపించి |అనగల రాగమై|

జీవన రాగమై బృందావన గీతమై
ఆ..ఆ
జీవన రాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా
ఇదేనా ఆ మురళీ

ఆ..ఆ…ఆ
వేణుగాన లోలుని మురిపించిన రవళి
నటనల సరళీ
ఆ నందన మురళీ
ఇదేనా…ఆ మురళీ
మువ్వల మురళి
ఇదేనా…ఆ మురళీ

మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి

సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
ఆ…ఆ..ఆ
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి
ఇదేనా
ఇదేనా…ఆ మురళీ
రేపల్లియ యద ఝల్లున
పొంగిన రవళి
నవరస మురళీ
అ నందన మురళీ
ఇదేనా ఆ మురళీ
మోహన మురళీ


చర్యలు

Information

3 వ్యాఖ్యలు

2 05 2008
Radhika

Thank you for the beautiful song. Listening to the song along with the lyrics makes it more wonderful. Waiting for more beautiful songs to be added to your collection.

10 04 2009
శశిధర్

మీ కృషి బహుథా ప్రశంసనీయం. చాల బాగుంది.
నాకు ఒక చిన్న information కావాలి. యేదో NTR సినిమా లో సి.నా.రె. వ్రాసిన వరూధినీ ప్రవరాఖ్య అంతర్నాటకం వుంది అది యే సినిమా తెలుపండి. పల్లవి ఇలా సాగుతుంది….

పాల వెన్నెల నురుగుల కెరటాల లో
మాలతీ లతా నికుంజాల లో

దయచెసి తెలుప గలరు.

ధన్యవాదములు

భవదీయుడు
శశిధర్

29 01 2010
నిరంజన్

ఆత్త్రేయ,ఆరుద్ర,శ్రీ శ్రీ లాంటి మహా రచయితల రచనా ప్రవాహాన్ని తట్టుకొని తనదైన ఒక నూతన ఒరవడిని స్ర్ర్షుష్టించిన వేటూరికి జన్మదిన శుభాకాంక్షలు.ఆయన వ్రాసిన పాటల్లో తెలుగుదనం ఉట్టిపదుతుంది.పల్లె పదాల అందాలు కళ్లకు కట్టినట్లుగ కనబదతాయి.జనపదాల సొయగాలు హొయలు పోతాయి.నీలి నీలి ఊసులు చెవుల్లో వినిపిస్తాయి.సాంప్రదాయ సంగీత కీర్తనలు,సంస్క్రత పదాలు సామాన్యులను అలరించలేవు అన్న వాదాన్ని “శంకరాభరణం” లో తన పాటల ద్వారా తప్పని నిరూపించారు.”సిరి సిరి మువ్వలో” వారు వ్రాసిన”ఝుమ్మంది నాదం ,సై అంది పాదం,తనువూగింది ఈ వేళా, చెలరేగింది ఒక రాసలీల” అనే పల్లవి ఆయన వ్రాసిన ప్రతిపాట విన్నప్పుడు కలిగే అనుభూతి.”ఆందంగా లెన ,అసలేం బాలెన,నీ ఈడు జోడు కానన,అలుసైపోయాన,అసలేమి కానన,వెషాలు చాలన” అని ప్రియుడి కోసం తపించే ప్రియురాలి తపన చెప్తూనే “మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే,అతనికి నువ్వునచ్చావో లేదొ, ఆ షుభ గడియ వచ్చేనొ రాదొ” అని హెచ్చరించినా వారికే చెల్లు.నవ్వింది మల్లె చండు ,”నచ్చింది గర్ల్ ఫ్రెండు ,దొరికనే మజగా చాన్సు ,జరుపుకో భలే రొమన్సు,యురెకా తకమిక,నీముద్దు తీరె దాక “అని ప్రియురాలి ప్రేమను పొందిన అనందాన్ని”స్నేహితుడా స్నేహితుడా,రహస్య స్నేహితుడా,చిన్న చిన్ననా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ” అని ప్రియున్ని తలుచికునే ప్రియురాలి అలోచనలు మనకు అందిచింది ఆయనే.”నవమి నాటి వెన్నల నెను,దశమి నాటి జాబిలి నెను,కలుసుకున్న ప్రతిరెయి,కార్తీక పున్నమి రెయు””మానసవీణ మదు గీతం,మన సంసారం సంగీతం’ అని సంసారంలొని సరిగమల్ని పలికిచింది అయనే .”క్రుషి ఉంటే మనుషులు ఋషులౌతారు,మహాపురుషులౌతరు,తరతరాలకు వెలుగౌతారు,ఇలవెల్పులౌతరు” అని తట్టిలేపింది వారె.”ఆకు చాటు పింద తడిసె,కొమ్మ చాటు పువ్వు తడిసె” అని కొంటె తనాన్ని నేర్పింది ఆయనే.”ఏ కులము నీ దంటే ,గొకులము నవ్వింది,మాధవుడు,యాదవుడు మాకులము పొమ్మంది.” అని కులాలు లేవు అని చెప్పందీ వారె.”పుణ్యము పాపము ఎరుగని నేను,పూజలు సేవలు ఎరుగని నెను,ఏ పూలు తేవాలి నీపూజకు,ఏ లీల సేయలి నీ సెవలొ,శివ శివ శంకర భక్తవ శంకర ,శంభో హర హర నమో నమో” అని ఒక అమాయక కొయదొర భక్తిని “ఓంకర నాదాలు సందానమౌ రాగమే శంకరాభరణము ” అని పండితుడి భక్తిని చెప్పింది ఆయేనె.”ఛినుకులా రాలి నదులుగా సాగి,వరదలై పొంగి,హిమములై రాలి,సుమములై పూసె,నీప్రేమ నా ప్రేమ” అంటూ ప్రేమ ప్రవాహంలో ప్రయణింపచేసింది వారే.”నిన్నటి దాక శిలనైనా ,నీ పదము సొకినే గౌతమి నైన” అని అన్నా,అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ ,అందరికీ అందనిదీ పూసిన కొమ్మ “అని ఒక సహజమైన పదాలతో అలరించిది వారె.”ఆమని పాడవె హాయిగా,మూగవై పొకు ఈ వేళ,” అని “అకాశానసూర్యుడుండడు సంధ్యవెళకే,చందమామకి రూపముండదు తెల్లవారితే,ఈ మజిలీ మూడునాళ్ళు ఈ జీవ యాత్రలో,ఒక ఒపూటలొనా రాలు పువ్వులెన్నో,నవ్వవే నవ మల్లిక ,ఆశలే అందలుగ ” అంటూ ధైర్యాన్నిచ్చింది వారె.”వెణువై వచ్చాను భువనానికి,గాలినై పోతాను గగనానికి ,మాటలన్నీ మౌనరాగం వాంచలన్నీ వాయులీనం ” అని చెప్పిన అయనే “అకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమావిరహమో గానమో ,వినిపించు నా చెలికి మేఘసందేశం” అని అయనే అన్నారు .బహుశా వారు వ్రాసిన ప్రతి పాట మేఘసందేశమనే యేమో.

వ్యాఖ్యానించండి