ఆ చింత నీకేలరా…నీ చెంత నేనుండగా

7 03 2012

http://www.youtube.com/watch?v=IAlBW8OxAYc&feature=watch-now-button&wide=1#t=1h15m34s

సంగీతం: కె.వి మహదేవన్
గానం: సుశీల
దర్శకత్వం: కె.విశ్వనాథ్
చిత్రం: శుభోదయం (1980)
తారాగణం: చంద్రమోహన్, సులక్షణ

మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే, మదనములకు?
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునె, తరంగిణులకు?

ఆ చింత నీకేలరా

ఆ చింత నీకేలరా
స్వామీ…నీ చెంత నేనుండగా
ఆ చింత నీకేలరా
స్వామీ…నీ చెంత నేనుండగా

ఆ చింత నీకేలరా

సొంతమైన ఈ సొగసులేలక
పంతమేల పూబంతి వేడగా

సొంతమైన ఈ సొగసులేలక
పంతమేల పూబంతి వేడగ

ఆ చింత నీకేలరా

సరసాల మనుగడ సగపాలు చేసీ
వరసైన నా ఈడునీ తోడు పెట్టీ

సరసాల మనుగడ సగపాలు చేసీ
వరసైన నా ఈడునీ తోడు పెట్టీ
అరుదైన మురిపాల పెరుగు మీగడలన్నీ
కరిగించి కౌగిళ్ళ తినిపించగా

ఆ చింత నీకేలరా
నీ చెంత నీకేలరా
ఆ చింత నీకేలరా

ఆ వంక ఆ వెన్నెలమ్మ
ఈ వంక ఈ వన్నెలమ్మా

ఆ వంక ఆ వెన్నెలమ్మ
ఈ వంక ఈ వన్నెలమ్మా
యే వంక లేని నెల వంక నేనమ్మ
నీకింక అలకెందుకమ్మా

లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల చేరునే, కుటజములకు?
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకమరుగునే, సాంద్ర నీహారములకు?
వినుత గుణశీల మాటలు వేయునేలా ?
ఆ చింత నీకేలరా
స్వామీ…నీ చెంత నేనుండగా
ఆ చింత నీకేలరా

సినిమాలో, ఒక భర్త తన తోడల్లుడు ఆస్తిని హారతి కర్పూరం లాగా కార్ల మీద కరిగించేస్తున్నాడని, తనకొచ్చేసరికి మామగారి ఆస్థిలోని వాటాకి తనకేమి మిగలదేమో అని భార్య దగ్గర వాపోతూ ఉంటాడు.తన భర్తని ఎటువంటి స్వార్థమూ, ఫలాపేక్ష లేని వాడని నమ్మే ఆ అమాయకురాలు, భర్తని తన బావగారికంటే ఉత్తముడిగా పోలుస్తూ, అతనిని బుజ్జగిస్తూ పాడే సందర్భములోది ఈ పాట.

బమ్మెర పోతన రాసిన శ్రీమధ్భాగవతం లోని ప్రహ్లాద చరితము లోని ఒక పద్యము నుంచి కొన్ని వాక్యాలను సందర్భోచితంగా ఈ పాటలో వాడారు వేటూరి.

“మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే, మదనములకు?”
మందార పువ్వులలోని తేనెలను తాగుతూ, ఆ మాధుర్యములో తేలుతున్న తేనెటీగ ఉమ్మెత్త పూవుల జోలికి వెళ్ళాలని తలుస్తుందా ?

“నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునె, తరంగిణులకు?”
నిర్మలంగా సాగే మందాకినీ నదిలో ఊయలూగుతున్న హంస, అలల తాకిడిని కావాలనుకుంటుందా?

“లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల చేరునే, కుటజములకు?”
కుటజము అంటే అంకుడుచెట్టనే ఒక రకమైన చెట్టట. లేత ఆకులను తిని ఆనందపడే కోయిల కుటజం చెంత చేరుతుందా ?

“పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకమరుగునే, సాంద్ర నీహారములకు?”
నిండు చంద్రుడి లేత కిరణాలను గ్రోలే చకోర పక్షి, దట్టమైన నక్షత్ర వీధిని కోరుకుంటుందా ?

ఉమ్మెత్త పువ్వులు, సంద్రం లోని అలలు, అంకుడు చెట్లు, నక్షత్ర వీధులూ వంటి గొప్ప విషయాలు ప్రకృతిలో ఎన్ని ఉన్నా, గుండెని తడిమి తృప్తి పర్చగల ఔన్నత్యం మాత్రం నిరాడంబరమైన వాటికే సొంతం. ఆ నిరాడంబరతలోని సౌందర్యాన్ని మనసుని కట్టిపడేసే మాటలతో పాట కట్టిన వేటూరికి పాదాభివందనాలు.

“సరసాల మనుగడ సగపాలు చేసీ
వరసైన నా ఈడునీ తోడు పెట్టీ
అరుదైన మురిపాల పెరుగు మీగడలన్నీ
కరిగించి కౌగిళ్ళ తినిపించగా”

ఈ నాలుగు లైన్లని వెనక్కి తిప్పి తిప్పి ఎన్ని సార్లు విన్నానో !! వేటూరి గారి టిపికల్ మాటల గారడికి కమ్మటి మీగడ పెరుగులాటి ఉదాహరణలివి. సరసాల మనుగడనేమో సగ”పాలు” చేసీ, దానికి ఆమె ఈడుని “తోడు”గా పెడితే తయారైన పెరుగు మీగడలని కరిగించి కౌగిళ్ళుగా తినిపించగా…ఆహహా…నా జిహ్వని కవ్వించడంతో పాటు,మనసుని కూడా గిలిగింతలు పెట్టింది ఈ పాట.

ఈ పాట విన్నాకో, వింటూ చూసాకో, వెన్న ముద్దల కమ్మదనాన్ని, వెన్నెల చల్లదనాన్ని, పిల్ల తెమ్మెర పంచుతున్న హాయినీ, భర్త అలక తీర్చడానికి ప్రయత్నిస్తున్న ఆ ముగ్ధ సోయగాన్ని అనుభవించి పరవశించని మనసు ఏదన్నా ఉంటే, దానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

********************************************************************************************************





రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే

31 07 2009

సంగీతం:M.M కీరవాణి
గానం:M.M కీరవాణి
రచన:వేటూరి
చిత్రం:మాతృదేవోభవ

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా
కలికి మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం
||రాలిపోయే పువ్వా||
చెదిరింది నీ గూడు గాలిగా
చిలకా గోరింకమ్మ గాథగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తన వాడు తారల్లో చేరగా
మనసూ మాంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా
తిరిగే భూమాతవు నీవై…వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై…ఆశలకే హారతివై
||రాలిపోయే పువ్వా||
అనుబంధమంటేనే  అప్పులే
కరిగే బంధాలన్ని మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే
తన రంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే
పగిలే ఆకాశము నీవై…జాలిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై…తీగ తెగే వేణియవై
||రాలిపోయే పువ్వా||




తికమక మకతిక – శ్రీ ఆంజనేయం

14 11 2008

తికమక మకతిక పరుగులు ఎటుకేసీ
నడవరా నరవరా నలుగురితో కలిసీ

శ్రీరామచంద్రున్ని కోవెల్లో ఖైదు చేసి
రాకాసి రావణుణ్ణి గుండెల్లో కొలువు చేసి
తల తిక్కల భక్తితో
తైతక్కలా మనిషీ

తికమక మకతిక పరుగులు ఎటుకేసీ
నడవరా నరవరా నలుగురితో కలిసీ

థై థిథిథై
థిథిథై థిథిథై
థిథిథై థిథిథై

తికమక మకతిక పరుగులు ఎటుకేసీ
నడవరా నరవరా నలుగురితో కలిసీ

వెతికే మజిలీ దొరికే దాకా
కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా
క్షణమైన నిన్నాపునా
కట్టాలి నీలోని అన్వేషణా
కన్నీటి పై వంతెనా
బెదురంటు లేని మది ఎదురు తిరిగి అడిగేన
బదులంటు లేని ప్రశ్న లేదు లోకాన
నీ శొకమే శ్లోకమై పలికించరా మనిషీ

తికమక మకతిక పరుగులు ఎటుకేసీ
నడవరా నరవరా నలుగురితో కలిసీ

అడివే అయినా కడలే అయినా
ధర్మాన్ని నడిపించు పాదాలకి శిరసొంచి దారీయనా
అటువంటి పాదాల పాదుకలకి పట్టాభిషేకమే కదా
ఆ రామ గాథ నువు రాసుకున్నదే కాదా
అదినేడు నీకు తగు దారి చూపనందా
ఆ అడుగుల జాడలు చెరపొద్దురా మనిషీ

తికమక మకతిక
తికమక తిక
తికమక మకతిక పరుగులు ఎటుకేసీ
నడవరా నరవరా నలుగురితో కలిసీ





భలే తాత మన బాపూజీ

1 10 2008

చిత్రం: దొంగ రాముడు
సంగీతం: పెండ్యాల

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ

బోసినవ్వుల బాపూజీ
చిన్నీ పిలక బాపూజీ

కుల మత బేధం వలదన్నాడు
కలిసి బతికితే బలమన్నాడు
మానవులంతా ఒకటన్నాడు
మనలో జీవం పోసాడు

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ

నడుం బిగించి లేచాడు
అడుగూ ముందుకు వేశాడు
కదం తొక్కుతూ పదం పాడుతూ
దేశం దేశం కదిలింది
గజగజలాడెను సామ్రాజ్యం
మనకు లభించెను స్వరాజ్యం
మనకు లభించెను స్వరాజ్యం

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ

సత్యాహింసలే శాంతి మార్గమని
జగతికి జ్యోతిని చూపించాడు
మానవ ధర్మం బోధించాడు
మానవ ధర్మం బోధించాడు
మహాత్ముడై ఇల వెలిశాడు

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ    |3|
*******************************





యాతమేసి తోడినా

1 10 2008
చిత్రం: ప్రాణం ఖరీదు
రచన: జాలాది
సంగీతం: చక్రవర్తి
గానం:S.P బాలు

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైన పూరి గుడిసేలోదైనా
గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు
ఆ దీపముండదు

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు

పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవు రా
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయేరా
కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాదీ
కడుపు కోత కోసినా అది మణిసికే జన్మ ఇస్తాది
బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు

అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
చీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడ మిద్దె లో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
వల్లకాడు ఒక్కటే
కూత నేర్సినోళ్ళ కులం కోకిలంటదా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు

*********************************************




జూనియర్ జూనియర్ జూనియర్

28 09 2008
చిత్రం: ఇది కథ కాదు
గానం: SP బాలు, రమోల, సదన్
రచన: ఆత్రేయ
సంగీతం: విశ్వనాధన్
 
జూనియర్ జూనియర్ జూనియర్
Yes Boss
ఇటు అటు కాని హౄదయంతోటి
ఎందుకురా ఈ తొందర నీకు     ||ఇటు అటు కాని ||
 
అటు ఇటు తానొక ఆటబొమ్మని
తెలిసే ఎందుకు వలచేవు         ||అటు ఇటు తానొక ||
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ
గడ్డిపోచా? నేనా? హి హి హి హి
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ
 
ఒడ్డున పెరిగే గడ్డిపోచకు
హౄదయం ఎందుకు ఉండకూడదు
ఉందని ఎందుకు ఒప్పుకోరాదు
రబ్బరు బొమ్మకు రాగం తెలుసు
ఆటబొమ్మకు ఆశలు తెలుసు
ఇద్దరు ఒక్కటి ఎందుకు కారాదు
జూనియర్ జూనియర్ జూనియర్
ఇటు అటు కాని హౄదయంతోటి
ఎందుకురా ఈ తొందర నీకు
 
సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
నీ మొహమురా హి హి హి హి హి
సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
తీగకు పందిరి కావలెగానీ
తెలుసా నువ్వే పందిరని
తీగకు పందిరి కావలెగానీ
తెలుసా నువ్వే పందిరని
 
నీటిని చూసి దాహము వేస్తే
తేనె కోసం తేటి వస్తే
పాపం గీపం అనడం ఛాదస్తం
No, it’s bad
But I am mad
మోడు కూడా చిగురించాలని
 మూగమనసు కోరే కోర్కెను
మోసం ద్రోహం అనడం అన్యాయం
హ హ హ హ
What పక పక పిక పిక
 
 
చైత్రములోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు
Boss, Love has no season, not even reason
Shut up.
 
చైత్రములోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు
ఉదయంకోసం పడమర తిరిగి
ఎదురుతెన్నులు కాచేవు
ఉదయంకోసం పడమర తిరిగి
ఎదురుతెన్నులు కాచేవు
 
ఎండా వాన కలిసొస్తాయి
వెలుగు చీకటి కలిసుంటాయి
జరగని వింతలు ఎన్నో జరిగాయి
It is highly idiotic…
No boss…It is fully romantic
 
 
పాట పాడెను ముద్దుల బొమ్మ
పక పక నవ్వేవెందులకమ్మా
మనసున ఉన్నది చెప్పీ నవ్వమ్మా
మనసున ఉన్నది చెప్పీ నవ్వమ్మా
 
 
*******************************************************************




అర్థ శతాబ్దపు అఙ్ఞానాన్నే

14 08 2008

చిత్రం: సిందూరం
దర్శకత్వం,నిర్మాత: కృష్ణవంశీ
రచన: సిరివెన్నెల
సంగీతం: శ్రీ

అర్థ శతాబ్దపు అఙ్ఞానాన్నే స్వతంత్రం అందామా ?
           స్వర్ణోత్సవాలు చేద్దామా?
ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యం అందామా?
           దానికి సలాము చేద్దామా?
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం
           ఈ రక్తపు సింధూరం
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా
           ఓ పవిత్ర భారతమా
అర్థ శతాబ్దపు అఙ్ఞానాన్నే స్వతంత్రం అందామా ?
           స్వర్ణోత్సవాలు చేద్దామా?
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా
           దాన్నే స్వరాజ్యం అందామా?

కులాల కోసం గుంపులు కడుతూ
మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడ లేని తెగువను చూపి తగువకు లేస్తారే
          జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో
          ముడుచుకుపోతూ
మొత్తం దేశం తగలడుతుందని నిజం తెలుసుకోరే
          తెలిసీ భుజం కలిపిరారే
అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి ?
          పోరి ఏమిటి సాధించాలి?
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాధించే సమరం
          ఈ చిచ్చుల సింధూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా
          ఓ అనాధ భారతమా

అర్థ శతాబ్దపు అఙ్ఞానాన్నే స్వతంత్రం అందామా ?
           స్వర్ణోత్సవాలు చేద్దామా?
ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యం అందామా?
           దానికి సలాము చేద్దామా?

అన్యాయాన్ని సహించని శౌర్యం
దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో క్రూర మృగంలా దాక్కుని ఉండాలా?
            వెలుగుని తప్పుకు తిరగాలా?
శత్రువుతో పోరాడే సైన్యం
శాంతిని కాపాడే కర్తవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో కవాతు చెయ్యాలా?
            అన్నల చేతిలో చావాలా?
తనలో ధైర్యం అడవికి ఇచ్చి, తన ధర్మం చట్టానికి ఇచ్చి
            ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం
            ఈ సంధ్యా సింధూరం

వేకువ వైపా చీకటి లోకా ఎటు నడిపేనమ్మా
                 గతి తోచని భారతమా

అర్థ శతాబ్దపు అఙ్ఞానాన్నే స్వతంత్రం అందామా ?
           స్వర్ణోత్సవాలు చేద్దామా?

యుద్ధ నినాదపు అరాచకాన్నే స్వరాజ్యమందామా
           దానికి సలాము చేద్దామా

తన తలరాతను తనే రాయగల అవకాశాన్నే వొదులుకుని
తనలో భీతిని, తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యం అని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకుని
కళ్ళు ఉన్న ఈ కబోధి జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం

కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
              చితిమంటల సిందూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా
              ఓ విషాద భారతమా

అర్థ శతాబ్దపు అఙ్ఞానాన్నే స్వతంత్రం అందామా ?
           స్వర్ణోత్సవాలు చేద్దామా?
ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యం అందామా?
           దానికి సలాము చేద్దామా?
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం
           ఈ రక్తపు సింధూరం
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా
           ఓ పవిత్ర భారతమా
అర్థ శతాబ్దపు అఙ్ఞానాన్నే స్వతంత్రం అందామా ?
           స్వర్ణోత్సవాలు చేద్దామా?
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా
           దాన్నే స్వరాజ్యం అందామా?

*******************************************************





సంతోషం సగం బలం

12 08 2008

చిత్రం: చిరునవ్వుతో
రచన: సిరివెన్నెల
సంగీతం: మణిశర్మ
గానం: యెస్.పి.బాలు

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా |నిన్నటి నీడలే|
చుట్టమల్లె కష్టమొస్తే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటు
కాళ్ళు కడిగి స్వాగతించకు
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేని పోని సేవ చేయకు
మిణుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలు కదా
ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తీయదా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

ఆశలు రేపినా అడియాసలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా  |ఆశలు రేపినా|
నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండ ఉండగలమా
కలలుగని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా
కలతలనే నీ కిలకిలతో తరిమెయ్యవే చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా

*************************************





చుట్టూపక్కల చూడరా

5 08 2008

 

చిత్రం: రుద్రవీణ
సంగీతం: ఇళయరాజా
రచన: సిరివెన్నెల
గానం: యస్.పి బాలు
దర్శకత్వం: కె.బాలచందర్

చుట్టూపక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా |2|
కళ్ళ ముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్థం
బ్రతుకును కానీయకు వ్యర్థం  |2| 

స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు
కరుణను మరిపించేదా…చదువూ సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా…సాంప్రదాయం అంటే  |కరుణను|

చుట్టూపక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా

నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది
రుణం తీర్చు తరుణం వస్తే…తప్పించుకుపోతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా…యేరు దాటగానే  |రుణం తీర్చు|

|చుట్టూపక్కల చూడరా చిన్నవాడా|
 

 





సంరక్షితం: గంధర్వగాన మధురిమలు

18 07 2008

ఈ విషయాన్ని సంకేతపదంతో సంరక్షించారు. దీన్ని చూడడానికి కింద సంకేతపదాన్ని ఇవ్వండి: