సంగీతం:M.M కీరవాణి
గానం:M.M కీరవాణి
రచన:వేటూరి
చిత్రం:మాతృదేవోభవ
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా
కలికి మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం
||రాలిపోయే పువ్వా|| చెదిరింది నీ గూడు గాలిగా
చిలకా గోరింకమ్మ గాథగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తన వాడు తారల్లో చేరగా
మనసూ మాంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా
తిరిగే భూమాతవు నీవై…వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై…ఆశలకే హారతివై
||రాలిపోయే పువ్వా|| అనుబంధమంటేనే అప్పులే
కరిగే బంధాలన్ని మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే
తన రంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే
పగిలే ఆకాశము నీవై…జాలిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై…తీగ తెగే వేణియవై
||రాలిపోయే పువ్వా||
ఇటీవలి అభిప్రాయములు