రచన: ఆత్రేయ
సంగీతం: ఇళయరాజా
గానం: S.P. బాలు జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై |4| నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా |నువ్వక్కడ|
ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలీ ఉర్రూతలూగి
మేఘాలతోటీ రాగాల లేఖ
నీకంపినాను రావా దేవీ జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై |జాబిల్లి కోసం | నీ పేరొక జపమైనది
నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా
ఉండీ లేక ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నువ్వే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై |జాబిల్లి కోసం| ———————————————————————————–
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై … ఆకాశమంటే శూన్యం, ఒక కల్పన (illusion). అలాంటి నల్లని చీకటి ఆకాశానికి ఒక అందాన్ని, అర్థాన్ని ఇచ్చేది చల్లని జాబిల్లి. ఆ జాబిల్లి రాక కోసం ఆకాశం ఎలా ఎదురు చూస్తుందో అలా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను , నీవు లేకపోతే నా జీవితం శూన్యం అంటూ ఎంత సింపుల్ గా , ఎంత అద్భుతంగా రాసారు ఆత్రేయ. ఉండీ లేక ఉన్నది నీవే,ఉన్నా కూడా లేనిది నేనే… చంద్రుడు ఉన్న చోట నుండీ కదలకపోయినా, ప్రతి రోజూ మనకు కనిపించడు (ఉండీ లేనట్టుగా). ఆకాశం ఎప్పుడూ కనిపించినా, నిజానికి అక్కడ ఏమి లేదు (ఉన్నా కూడా లేనిది నేనే). ఒక అబ్బాయి ప్రేమించిన అమ్మాయి కనపడక ఆమెను పువ్వుల్లో, చుక్కల్లో , నునునిగ్గుల మొగ్గల్లో ఊహించుకుంటూ మేఘాల తోటి రాగాల లేఖ పంపాడట. ఇంత అందంగా ఇంకెవరు రాయగలరు. ఒక్క ఆత్రేయగారు తప్ప.
అంత అందమైన మాటలను ఇంత అందమైన పాట గా మలిచిన ఇళయరాజా కి , అంతకంటే అందంగా పాడిన బాలుకి హ్యాట్సాఫ్. ఈ పాట విన్నప్పుడల్లా, ఎందుకో తెలియదు, గట్టిగా ఏడవాలనిపిస్తుంది.

ఇటీవలి అభిప్రాయములు