హాయిగా పిల్ల తెమ్మెర లాగా సాగిపోయే సంగీతం,మనసుకు హత్తుకునే సాహిత్యంతో జోలపాటంటే ఇలా ఉండాలి అనిపించే అందమైన పాట.
చిత్రం:శభాష్ రాముడు
రచన:సముద్రాల
సంగీతము: ఘంటసాల
గానం: సుశీల
ఇక్కడ వినండి
రేయి మించెనోయి రాజా
హాయిగ నిదురించరా(2) ||రేయి మించెనోయి||
వెల్లి విరిసీ వెన్నెల్లు కాసి
చల్లని చిరుగాలి మెల్లంగా వీచె ||వెల్లి విరిసీ||
స్వప్నాల లోన స్వర్గాలు కంటూ
స్వర్గాలలోన దేవ గానాలు వింటూ
హాయిగ నీవింక నిదురించవోయి ||రేయి మించెనోయి||
చీకటి వెంటా వెలుగే రాదా
కష్టసుఖాలు ఇంతే కాదా ||చీకటి వెంటా||
చింతా వంతా నీకేలనోయి
అంతా జయమౌను శాంతించవోయి
హాయిగ నీవింక నిదురించవోయి ||రేయి మించెనోయి||

ఇటీవలి అభిప్రాయములు