భలే తాత మన బాపూజీ

1 10 2008

చిత్రం: దొంగ రాముడు
సంగీతం: పెండ్యాల

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ

బోసినవ్వుల బాపూజీ
చిన్నీ పిలక బాపూజీ

కుల మత బేధం వలదన్నాడు
కలిసి బతికితే బలమన్నాడు
మానవులంతా ఒకటన్నాడు
మనలో జీవం పోసాడు

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ

నడుం బిగించి లేచాడు
అడుగూ ముందుకు వేశాడు
కదం తొక్కుతూ పదం పాడుతూ
దేశం దేశం కదిలింది
గజగజలాడెను సామ్రాజ్యం
మనకు లభించెను స్వరాజ్యం
మనకు లభించెను స్వరాజ్యం

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ

సత్యాహింసలే శాంతి మార్గమని
జగతికి జ్యోతిని చూపించాడు
మానవ ధర్మం బోధించాడు
మానవ ధర్మం బోధించాడు
మహాత్ముడై ఇల వెలిశాడు

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ    |3|
*******************************





యాతమేసి తోడినా

1 10 2008
చిత్రం: ప్రాణం ఖరీదు
రచన: జాలాది
సంగీతం: చక్రవర్తి
గానం:S.P బాలు

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైన పూరి గుడిసేలోదైనా
గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు
ఆ దీపముండదు

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు

పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవు రా
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయేరా
కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాదీ
కడుపు కోత కోసినా అది మణిసికే జన్మ ఇస్తాది
బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు

అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
చీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడ మిద్దె లో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
వల్లకాడు ఒక్కటే
కూత నేర్సినోళ్ళ కులం కోకిలంటదా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు

*********************************************