అర్థ శతాబ్దపు అఙ్ఞానాన్నే

14 08 2008

చిత్రం: సిందూరం
దర్శకత్వం,నిర్మాత: కృష్ణవంశీ
రచన: సిరివెన్నెల
సంగీతం: శ్రీ

అర్థ శతాబ్దపు అఙ్ఞానాన్నే స్వతంత్రం అందామా ?
           స్వర్ణోత్సవాలు చేద్దామా?
ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యం అందామా?
           దానికి సలాము చేద్దామా?
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం
           ఈ రక్తపు సింధూరం
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా
           ఓ పవిత్ర భారతమా
అర్థ శతాబ్దపు అఙ్ఞానాన్నే స్వతంత్రం అందామా ?
           స్వర్ణోత్సవాలు చేద్దామా?
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా
           దాన్నే స్వరాజ్యం అందామా?

 

కులాల కోసం గుంపులు కడుతూ
మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడ లేని తెగువను చూపి తగువకు లేస్తారే
          జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో
          ముడుచుకుపోతూ
మొత్తం దేశం తగలడుతుందని నిజం తెలుసుకోరే
          తెలిసీ భుజం కలిపిరారే
అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి ?
          పోరి ఏమిటి సాధించాలి?
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాధించే సమరం
          ఈ చిచ్చుల సింధూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా
          ఓ అనాధ భారతమా

 

అర్థ శతాబ్దపు అఙ్ఞానాన్నే స్వతంత్రం అందామా ?
           స్వర్ణోత్సవాలు చేద్దామా?
ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యం అందామా?
           దానికి సలాము చేద్దామా?

 

అన్యాయాన్ని సహించని శౌర్యం
దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో క్రూర మృగంలా దాక్కుని ఉండాలా?
            వెలుగుని తప్పుకు తిరగాలా?
శత్రువుతో పోరాడే సైన్యం
శాంతిని కాపాడే కర్తవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో కవాతు చెయ్యాలా?
            అన్నల చేతిలో చావాలా?
తనలో ధైర్యం అడవికి ఇచ్చి, తన ధర్మం చట్టానికి ఇచ్చి
            ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం
            ఈ సంధ్యా సింధూరం

*******************************************************


చర్యలు

సమాచారం

మీ ఉద్దేశ్యం…