చిత్రం:గమ్యం
రచన:సిరివెన్నెల
సంగీతం:E.S మూర్తి,R.అనిల్
దర్శకత్వం:రాధాకృష్ణ
ఎంతవరకూ ఎందుకొరకు
ఇంత పరుగూ అని అడక్కు
గమనమే నీ గమ్యం అయితే
బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్న లోనే బదులు ఉందే
గుర్తు పట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా
ఎంతవరకూ ఎందుకొరకు
ఇంత పరుగూ అని అడక్కు
గమనమే నీ గమ్యం అయితే
బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్న లోనే బదులు ఉందే
గుర్తు పట్టే గుండెనడుగు
కనపడేవెన్నెన్ని కెరటాలు
కలగలిపి సముద్రమంటారు
అడగరే ఒక్కొక అలపేరూ
మనకిలా ఎదురైన ప్రతివారు
మనిషనే సంద్రానకెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరూ
సరిగా చూస్తున్నదా నీ మది
గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలూ
నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలీ వెలుతురు
నీ చూపుల్లో లేదా
మన్నూ మిన్నూ నీరూ
అన్నీ కలిపితే నువ్వే కాదా…కాదా
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా
మనసులో నీవైన భావాలే
బయటకనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే
స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం
నీలోని చెలిమికోసం
మోసం దోషం ద్వేషం
నీ మకిలి మదికి భాష్యం
పుటకా చావూ రేండే రెండు
నీకవి సొంతం కావు పోనీ
జీవితకాలం నీదే నేస్తం
రంగులు యేం వేస్తావో కానీ..
ఇటీవలి అభిప్రాయములు