రక్షించబడినది : గంధర్వగాన మధురిమలు

18 07 2008

ఈ టపాని సంకేతపదంతో సంరక్షించారు. దీన్ని చూడడానికి మీ సంకేతపదం ఇక్కడ ఇవ్వండి:






ఎంతవరకు ఎందుకొరకు

16 07 2008

 

చిత్రం:గమ్యం
రచన:సిరివెన్నెల
సంగీతం:E.S మూర్తి,R.అనిల్
దర్శకత్వం:రాధాకృష్ణ

ఎంతవరకూ ఎందుకొరకు
ఇంత పరుగూ అని అడక్కు
గమనమే నీ గమ్యం అయితే
బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్న లోనే బదులు ఉందే
గుర్తు పట్టే గుండెనడుగు

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా

ఎంతవరకూ ఎందుకొరకు
ఇంత పరుగూ అని అడక్కు
గమనమే నీ గమ్యం అయితే
బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్న లోనే బదులు ఉందే
గుర్తు పట్టే గుండెనడుగు

కనపడేవెన్నెన్ని కెరటాలు
కలగలిపి సముద్రమంటారు
అడగరే ఒక్కొక అలపేరూ
మనకిలా ఎదురైన ప్రతివారు
మనిషనే సంద్రానకెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరూ
సరిగా చూస్తున్నదా నీ మది
గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలూ
నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలీ వెలుతురు
నీ చూపుల్లో లేదా
మన్నూ మిన్నూ నీరూ
అన్నీ కలిపితే నువ్వే కాదా…కాదా

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా

మనసులో నీవైన భావాలే
బయటకనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే
స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం
నీలోని చెలిమికోసం
మోసం దోషం ద్వేషం
నీ మకిలి మదికి భాష్యం
పుటకా చావూ రేండే రెండు
నీకవి సొంతం కావు పోనీ
జీవితకాలం నీదే నేస్తం
రంగులు యేం వేస్తావో కానీ..





మౌనమేలనోయి

13 07 2008
ఇక్కడ వినండి

చిత్రం:సాగర సంగమం
దర్శకత్వం:కాశీనాథుని విశ్వనాథ్
సంగీతం:ఇళయరాజా
రచన:వేటూరి
గానం:బాలు

మౌనమేలనోయి
మౌనమేలనోయి…ఈ మరపు రాని రేయి
మౌనమేలనోయి…ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెల…వెలిగే కన్నులా
ఎదలో వెన్నెల…వెలిగే కన్నులా
తారాడే హాయిలో
ఇక మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి

పలికే పెదవి…వొణికింది ఎందుకో
వొణికే పెదవి…వెనకాల ఏమిటో
కలిసే మనసులా…విరిసే వయసులా
నీలి నీలి వూసులు…లేతగాలి బాసలు
ఏమేమో అడిగినా     |
మౌనమేలనోయి|

హిమమే కురిసే…చందమామ కౌగిట
సుమమే విరిసే…వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగులా…వలపు మడుగులా
కన్నె ఈడు ఉలుకులు…కంటిపాప కబురులు
ఎంతెంతో తెలిసిన    |
మౌనంమేలనోయి|





జాబిల్లి కోసం ఆకాశమల్లే

6 07 2008

ఇక్కడ వినండి

 చిత్రం: మంచి మనసులు
 రచన: ఆత్రేయ
 సంగీతం: ఇళయరాజా
 గానం: S.P. బాలు
జాబిల్లి  కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై |4|
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
నువ్వక్కడ నేనిక్కడ
పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా |నువ్వక్కడ|
ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలీ ఉర్రూతలూగి
మేఘాలతోటీ రాగాల లేఖ
నీకంపినాను రావా దేవీ
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై |జాబిల్లి కోసం |
నీ పేరొక జపమైనది
నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా
ఉండీ లేక ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నువ్వే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై |జాబిల్లి కోసం|
———————————————————————————–

 జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై … ఆకాశమంటే శూన్యం, ఒక కల్పన (illusion). అలాంటి నల్లని చీకటి ఆకాశానికి ఒక అందాన్ని, అర్థాన్ని ఇచ్చేది చల్లని జాబిల్లి. ఆ జాబిల్లి రాక కోసం ఆకాశం ఎలా ఎదురు చూస్తుందో అలా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను , నీవు లేకపోతే నా జీవితం శూన్యం అంటూ ఎంత సింపుల్ గా , ఎంత అద్భుతంగా రాసారు ఆత్రేయ. ఉండీ లేక ఉన్నది నీవే,ఉన్నా కూడా లేనిది నేనే… చంద్రుడు ఉన్న చోట నుండీ కదలకపోయినా, ప్రతి రోజూ మనకు కనిపించడు (ఉండీ లేనట్టుగా). ఆకాశం ఎప్పుడూ కనిపించినా, నిజానికి అక్కడ ఏమి లేదు (ఉన్నా కూడా లేనిది నేనే). ఒక అబ్బాయి ప్రేమించిన అమ్మాయి కనపడక ఆమెను పువ్వుల్లో, చుక్కల్లో , నునునిగ్గుల మొగ్గల్లో ఊహించుకుంటూ మేఘాల తోటి రాగాల లేఖ పంపాడట. ఇంత అందంగా ఇంకెవరు రాయగలరు. ఒక్క ఆత్రేయగారు తప్ప.

అంత అందమైన మాటలను ఇంత అందమైన పాట గా మలిచిన ఇళయరాజా కి , అంతకంటే అందంగా పాడిన బాలుకి హ్యాట్సాఫ్. ఈ పాట విన్నప్పుడల్లా, ఎందుకో తెలియదు, గట్టిగా ఏడవాలనిపిస్తుంది.