పూతవేసిన లేత మావిని

23 04 2008

 కీరవాణి స్వరపరిచిన ఈ అందమైన పాట “సంగమం” చిత్రం లోనిది.ఇంకా (నాకు తెలిసి) విడుదల అవ్వని ఈ సినిమాలో నటించిన ఈ నాజూకు సుందరి గద్దె సింధూర మన తెలుగు అమ్మాయట. పుట్టింది విజయవాడ, పెరిగింది ఆస్ట్రేలియాలో. 2005 లో మిస్ ఇండియా పోటీలో గెలిచి మిస్ వరల్డ్ పోటీలో మొదటి రన్నర్ అప్ గా నిలిచింది. తెలుగులో మాట్లాడటం,చదవడం,రాయటం కూడా వచ్చునట.

 ఇక్కడ వినండి
పూతవేసిన లేత మావిని చూసినట్టుంది
నువు నవ్వుతూ ఉంటే
పాత పాటలు కోకిలమ్మే పాడినట్టుంది
నీ పలుకు వింటుంటే
మాటలే వరదలై ఉరకలేస్తున్నవీ
చెంత నువ్వుంటే
వుంటే
పూతవేసిన లేత మావిని చూసినట్టుంది
మునుపు కలుగని మురిపెమేదో
ముద్దుగా నా ముందరుంది
అలుపు తెలియని వలపు నాలో
హద్దులే చెరిపేయమంది
లేనిదేది నాకు లేదను తలపు ఉండేది
ఇంతలో నీ పరిచయం ఒక లోటు తెలిపింది
నువ్వే కావాలని కలవాలని కలగాలని
ప్రియా నా ప్రాణమే మారాము చేసింది
 
సగప సగనిని సదమ పసనిరిసనిని దపగమదపరిగా

అంటూ పోత పోసిన పసిడి బొమ్మే కదిలినట్టుంది
నువు నడచి వస్తుంటే
కోత కోసిన గుండె నాలో మిగిలి ఉంటుంది
నను విడిచి వెళుతుంటే
మాటలే మౌనమై ఉసురు తీస్తున్నవీ
ఒంటరై ఉంటే

కుదురు దొరకని ఎదురు చూపే
కొంటెగా వెంటాడమంది
నిదుర కుదరని కంటి పాపే
వెంటనే నిను చూడమంది
ఏమిటో నా తీరు నాకే
కొత్తగా ఉంది
ప్రేమ ఊసులు మానలేని
మత్తులో ఉంది
నిరీక్షణ చాలని
ఇక చాలని అడగాలని
చెలీ నా ఊపిరే నిను చేరుకుంటుంది
 
ననన నననన ననన నననన ననన నననన తనననా

అంటూ చేతికందని చందమామే అందినట్టుంది
నువు తాకుతూ ఉంటే
చోటు ఇమ్మని చుక్కలేవో అడిగినట్టుంది
నను తోడు రమ్మంటే
మాటలే కవితలై మురిసిపోనున్నవి
జంట నువ్వైతే
ఐతే

 
 
చిత్రం: సంగమం
సాహిత్యం: అనంత శ్రీరాం
సంగీతం: కీరవాణి
 
గానం: కీరవాణి, ప్రణవి

 

 

 

 


చర్యలు

సమాచారం

మీ ఉద్దేశ్యం…