జగమంత కుటుంబం నాది

10 04 2008

జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది  |2|
సంసార సాగరం నాదే
సన్యాసం శూన్యం నాదే  |జగమంత కుటుంబం|

కవినై కవితనై
భార్యనై భర్తనై  |కవినై కవితనై|
మల్లెల దారిలో మంచు ఏడారిలో |2|
పన్నీటి జయగీతాల
కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ
నాతో నేనే రమిస్తూ
వంటరినై అనవరతం
కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్నీ
రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని  |జగమంత కుటుంబం|
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై   |2|
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ
నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిముషం
కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల
హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాన కాలాన్ని ఇంద్రజాలాన్ని
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది  |2|
గాలి పల్లకీలోన తరలి నా
పాట పాప వూరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి
తన్మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది  |2|
చిత్రం: చక్రం
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: చక్రి
గానం: శ్రీ


చర్యలు

సమాచారం

3 స్పందనలు

12 04 2008
Dr. Ram$

యిది నాకు చాలా ఇష్టమైన పాట.. నిజంగా జనాలు అందరు యీ పాట భావం అర్ధం చేసుకొని, అందరు యిలా సంతోషం గా జీవితం గడిపితే.. హ్హహ్హహ్హ..ఆశ కి హద్దు వుండాలి కదా..!!

16 07 2008
srinivas

ee paata padindi evaru? Konchem cheppagalaraa?

16 07 2008
amritaveena

శ్రీనివాస్ గారు ఈ పాట పాడింది శ్రీ

మీ ఉద్దేశ్యం…