బుల్లితెర

“అమృతం” టీవి సీరియల్ టైటిల్ సాంగ్
రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం:కళ్యాణి మాలిక్

ఇక్కడ వినండి

హయ్యోలూ … అమ్మోలూ ఇంతేగా బ్రతుకు హ్హొహ్హొహ్హొ
ఆహాలూ … ఓహోలూ ఉంటాయి వెతుకు అహ్హాహ్హా
మనచేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోలు
ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు
వార్తల్లో హెడ్ లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు
అయొడిన్ తో అయిపోయే గాయలే మనకు గండాలు

ఎటో వెళిపోతూ నిను చూసింది అనుకోవా ట్రబులు
హెల్లో … హౌ డు యూ డూ అని అంటోంది అంతే నీ లెవెలు
ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా
తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా
గాలైనా రాదయ్యా …
నీదసలే ఇరుకు అద్దిల్లు
కాలైన పెడుతుందా…
నీ ఇంట్లో పెనుతుఫానసలు

ఓరేయ్ ఆంజనేయులు
తెగ ఆయాస పడిపోకు చాలు
మనం ఈదుతున్నాం
ఒక చెంచాడు భవసాగరాలు
కర్రెంటు రెంటు ఎట్సెట్రా మన కష్టాలు
కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు
నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్
భారీగా ఫీలైయ్యే టెన్షన్లేంపడకు గోలిమార్

 

మీ ఉద్దేశ్యం…